ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.ఇందులో భాగంగా రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారని తెలుస్తోంది.
సిగ్నల్ బ్రేక్ చేసి రైళ్లను ఆపిన కొందరు దుండగులు ప్రయాణికులను బెదిరించి నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు.సింగరాయకొండ – తెట్టు మధ్య రెండు ఎక్స్ ప్రెస్ లలో దోపిడీ జరిగిందని సమాచారం.
కాగా సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ తో పాటు సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దొంగలు హల్ చల్ చేశారు.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.