రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వ్యాన్, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.
సికార్ నుంచి నాగ్ పూర్ వెళ్తుండగా ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.
నాగ్ పూర్ కు వివాహ వేడుకకు కుటుంబం అంతా వ్యాన్ లో కలిసి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.