జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
పాదయాత్ర చేసిన వాళ్లు ముఖ్యమంత్రులు అవ్వరని తెలిపారు.ప్రాథమిక హక్కులను కాపాడే వ్యక్తులకే సీఎం స్థానం వరించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను రూములో కూర్చొని సమస్యలపై అధ్యయనం చేస్తుంటానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి రెండేళ్లుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
అధ్యయనం చేయడం వలనే బాగా మాట్లాడగలిగానని వెల్లడించారు.తన చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరన్న పవన్ కల్యాణ్ జనం చుట్టూ తిరగాలని సూచించారు.
రాష్ట్రంలో చిన్న పిల్లలు, మహిళల ట్రాఫికింగ్ జరుగుతోందన్నారు.రేప్ జరిగితే తల్లిదండ్రులదే తప్పు అనే హోంమంత్రి మనకున్నారంటూ విమర్శించారు.