టాలీవుడ్ లో మొదటి వంద కోట్ల సినిమా ఏది అంటే ‘మగధీర'( Magadheera ) అనడంలో సందేహం లేదు.2009 సంవత్సరంలో జులై 31న మగధీర సినిమా విడుదల అయ్యింది.ఆ సమయంలో తెలుగు సినిమా బడ్జెట్ 15 నుండి 25 కోట్లు మాత్రమే.భారీ బడ్జెట్ సినిమాలు అంటే మరో అయిదు పది కోట్లు పెరిగేవి.అంతే కాకుండా 50 కోట్లు అంతకు మించి ఖర్చు చేసేవారు కాదు.అప్పట్లో సినిమాల వసూళ్లు కూడా పాతిక కోట్లు వస్తే సూపర్ హిట్.50 కోట్లు వస్తే ఇండస్ట్రీ హిట్ అన్నట్లుగా ఉండేది.అలాంటి సమయంలో రాజమౌళి( Rajamouli ) మగధీర సినిమా కోసం అల్లు అరవింద్ తో ఏకంగా 40 కోట్లకు పైగా ఖర్చు చేయించాడు.
చరణ్( Ram Charan ) కెరీర్ కోసం డబ్బులు వచ్చినా రాకున్నా పర్వాలేదు అనుకున్న అల్లు అరవింద్ ఆ మొత్తం ఖర్చు పెట్టాడు.ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్( Allu Aravind ) మాట్లాడుతూ మగధీర సినిమాకు డబ్బులు పెడుతున్న సమయంలో మళ్లీ వస్తాయి అనే ఆశలు ఉండేవి కాదు.కానీ విడుదల తర్వాత భారీ ఎత్తున వసూళ్లు వచ్చాయి అన్నాడు.మగధీర సినిమా అప్పట్లో రూ.40 కోట్ల బడ్జెట్ తో పూర్తి అయింది కానీ ఇప్పుడు అలాంటి కథతో సినిమాను తీయాలి అంటే రాజమౌళి కచ్చితంగా రూ.250 కోట్ల నుండి రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.
హీరో పారితోషికం తో పాటు మేకింగ్ కాస్ట్ కూడా భారీగా పెరిగింది.అందుకే మగధీర ఇప్పుడు తీస్తే భారీ గా ఖర్చు పెట్టాల్సి వచ్చేది.ఇక వసూళ్ల విషయానికి వస్తే అప్పట్లో ఈ సినిమా రూ.150 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.ఇప్పుడైతే ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు సొంతం చేసుకునేది.అప్పట్లో పాన్ ఇండియా కాన్సెప్ట్ పెద్దగా ఉండేది కాదు.
కనుక మగధీర సినిమా ను అన్ని భాషల్లో థియేటర్ల ద్వారా విడుదల చేయడం సాధ్యం కాలేదు.అందుకే పాన్ ఇండియా రేంజ్( Pan India Release ) లో మగధీర ను విడుదల చేసి ఉంటే తప్పకుండా రూ.500 కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసేవి అనడంలో సందేహం లేదు.