పెళ్లి చేసి చూడు.ఇళ్లు కట్టి చూడు అంటారు పెద్దలు.
ఆ రెండు విషయాలు చాలా ఖర్చుతో కూడుకున్న పని.మనిషి జీవితంలో ఎక్కువ డబ్బులు వాటికే ఖర్చు పెడతాడు.పెళ్లి జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకోవాలని చాలా డబ్బులు ఖర్చు చేస్తారు.ఇక మంచి ఇంటిని నిర్మించుకోవాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది.సొంతింటి కల( Own House )ను నిజం చేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.అయితే ఇందుకోసం చాలామంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు.
అయితే హోమ్ లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ( RBI ) బ్యాడ్ న్యూస్ తెలిపింది.రెపోరేటును 6.50 వద్ద కొనసాగించాలని చూస్తోంది.దీంతో హోమ్ లోన్ రీపేమెంట్ చేస్తున్నవారికి 2024 రెండో త్రైమాసికం వరకు తీపి కబురు అందకపోవచ్చు.
దీంతో హోమ్ లోన్( Home Loan ) తీసుకుని ఈఎంఐ కడుతున్నవారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.అధిక వడ్డీ రేటు 2024 వరకు కొనసాగే అవకాశముందని ఇటీవల రాయిటర్స్ తన కథనంలో తెలిపింది.
మార్చి 31,2024తో ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం( Inflation ) సగటున 5 శాతం కంటే తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
2024 మార్చి నాటికి 25 బేసిస్ పాయింట్ల, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్లలో కోత ఉంటుందని భావించారు.కానీ ఇఫ్పుడు తగ్గించే అవకాశం లేదని అంటున్నారు.దీంతో 2024 మార్చి వరకు ఈఎంఐలు( EMI ) తగ్గే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
దీని వల్ల బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కనిపించడం లేదు.దీంతో బ్యాంకులు కూడా ఈఎంఐలను తగ్గించే అవకాశం ఉండదు.హోమ్ లోన్లు రెపో రేటుతో లింక్ అయి ఉంటాయి.దీని వల్ల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటు( RBI Repo Rate )ను తగ్గించే కానీ ఈఎంఐ రేట్లు తగ్గుతాయి.
కానీ ఇప్పుట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది.