'థీమ్ ఆఫ్ బ్రో' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న వీడియో!

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”బ్రో ది అవతార్” ఒకటి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ పెంచడంతో మేకర్స్ సఫలం అయ్యారు.

 Theme Of Bro Lyrical, Theme Of Bro, Vinodhaya Sitham, Bro, Pawan Kalyan, Theme O-TeluguStop.com

ఇక ఈ వీకెండ్ లోనే ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగేలా చేసాయి.

ఇంకా పవర్ స్టార్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా తాజాగా మేకర్స్ మరో క్రేజీ వీడియోను రిలీజ్ చేయగా అది బాగా ఆకట్టు కుంటుంది.

థీమ్ ఆఫ్ బ్రో( Theme of BRO)” పేరుతో లిరికల్ వీడియో రిలీజ్ చేయగా ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.ఈ థీమ్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.థమన్ ఈ పాటకు డిఫరెంట్ గా మ్యూజిక్ ఇవ్వడంతో అందులోను పవన్ కళ్యాణ్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించడంతో ఇది అందరిని అలరిస్తుంది.చాలా మంది సింగర్స్ ఈ పాటను ఆలపించారు.

మొత్తానికి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ అయితే భారీగా పెరిగింది.ఇక సముద్రఖని( Samuthirakani ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కాగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.

https://youtu.be/bnnF5Rr5VRw
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube