తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ మలయాళం ( Malayalam )నుంచి వచ్చి ఇక్కడ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకొని సెట్ అయిపోతున్నారు…ప్రస్తుతం నటి సంయుక్త మీనన్ కూడా ఇలా తెలుగు ఇండస్ట్రీ లో సెట్ అయి పోయింది…తను మొదట మలయాళంలో పలు సినిమాలలో నటించిన తెలుగులో మాత్రం భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇందులో సంయుక్త ( Samyuktha )రానా భార్య పాత్రలో నటించి సందడి చేశారు.
ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సంయుక్త అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
విధంగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే కోలీవుడ్ నటుడు ధనుష్( Kollywood actor Dhanush ) తెలుగులో నటించిన సార్ అనే సినిమాలో కూడా అవకాశం అందుకున్నారు.ఈ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ కూడా గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ సినిమా తర్వాత సంయుక్త నటించిన విరూపాక్ష సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి సంయుక్త పేరు టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
అయితే ఈమె తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా తరువాత ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.
అయితే ఈమెకు ఎలాంటి అవకాశాలు రాలేదా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.
అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం సంయుక్త మీనన్( Sanyukta Menon ) కి సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ ఈమె వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటించాలని తనకు వచ్చిన సినిమా అవకాశాలను రిజెక్ట్ చేస్తున్నారట.అందుకే ఈమె కొత్త సినిమాలను ప్రకటించలేదని తెలుస్తుంది.ఇలా ఎంతో టాలెంట్ కలిగినటువంటి సంయుక్త కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
ఇలా చేయడం చాలా వరకు మంచి పద్దతి అని సినిమేదవులు కూడా సంయుక్త మీనన్ ని మెచ్చుకుంటున్నారు ఇక సాయి పల్లవి కూడా తనకి నచ్చిన క్యారెక్టర్ ఉంటేనే సినిమాలు చేస్తోంది లేకపోతే చేయడం లేదు…ఇలా క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ చేస్తేనే ఇండస్ట్రీ లో ఎక్కువ రోజుల పాటు హీరోయిన్ గా కొనసాగవచ్చు అని వీళ్లిద్దరూ తీసుకున్న డిసిజన్స్ కరెక్ట్ అంటూ చాలా మంది అంటున్నారు.