భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ అఖిల్ మహాజన్

24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్( డి ఆర్ ఎఫ్ ) టీమ్ అందుబాటులో.విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.

 People Of The District Should Be Vigilant In View Of Heavy Rains: Sp Akhil Mahaj-TeluguStop.com

వాగులు,వంకలు,నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుంది,కావున వాటి వద్దకి ఎవరు వెల్లద్దు రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలి.

అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పెట్టుకోవద్దు,బురద కారణంగా టైర్లు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పేట్టుకోవద్దని,జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యాత్రగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని,డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్( డి ఆర్ ఎఫ్ ) టీమ్,జిల్లా పోలీస్ యంత్రంగం 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే నిమిషాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) .ప్రకటనలో తెలిపారు.

మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెల్లద్దు అని అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని అన్నారు.

గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు.జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా,రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఎస్పీ పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ఇతర శాఖ ల అధికారులతో, ప్రజల సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలి అని అధికారులకు సూచించారు.భారీ వర్షం బలమైన గాలుల సమయంలో విద్యుత్ తీగలు,స్తంబాలు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండండి.

అలాగే తడి చేతులతో స్విచ్ బోర్డులు ముట్టకోవద్దు అని సూచించారు.ప్రజలందరూ ఈ వర్షా కాలంలో పోలీస్ వారి సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube