టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో గుణశేఖర్( Director Gunasekhar ) ఒకరు కాగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా గుణశేఖర్ మంచి స్క్రిప్ట్ తో కలిస్తే ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు.గుణశేఖర్ డైరెక్షన్ లో రానా హీరోగా హిరణ్యకశిప సినిమా( Hiranyakashyap Movie ) తెరకెక్కనుందని గతంలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది.
అయితే రానా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అందించిన కథతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే అన్యాయం జరిగితే మాత్రం వదిలే పరిస్థితి లేదంటూ గుణశేఖర్ ఒకింత ఘాటుగా స్పందించడం గమనార్హం.తనకు అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పుకొచ్చారు.
తన ఐడియాతోనే రానా( Rana Daggubati ) సినిమా తెరకెక్కుతోందని తెలిసి గుణశేఖర్ ఈ విధంగా కామెంట్లు చేశారు.రాబోయే రోజుల్లో ఈ వివాదం హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది.రానా ఈ వివాదం గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.దగ్గుబాటి హీరోలు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు.ఈ వివాదం గురించి రానా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
రానా పారితోషికం ప్రస్తుతం 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రానాకు రాబోయే రోజుల్లో సైతం వరుస విజయాలు దక్కుతాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రానా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాక్సాఫీస్ పాన్ ఇండియా లెవెల్ లో షేక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.