కృష్ణాష్టమి సహా శ్రావణమాసం రెండవ పక్షంలో వచ్చే పండుగ గురించి తెలుసా..?

నిజ శ్రావణమాసం ఆగస్టు 17 గురువారం నుంచి మొదలై సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది.మొదటి 15 రోజులు అంటే శ్రావణ శుద్ధ పాండ్యమి ( Shravana Suddha Pandyami )నుంచి పౌర్ణమి వరకు వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Do You Know About The Festival That Falls In The Second Half Of Shravan Month In-TeluguStop.com

ఇక సెప్టెంబర్ ఒకటి శ్రావణ బహుళ పాడ్యమి నుంచి సెప్టెంబర్ 15 అమావాస్య వరకు వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం.శ్రావణ బహుళ పాడ్యమి రోజు ధన ప్రాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

ఇది మొదలు భద్రపద పౌర్ణమి వరకు వ్రతం చేయాలని దీనినే శివ వ్రతం ( Shiva Vrat )అని కూడా అంటారు.రోజు మొదలు నాలుగు నెలల పాటు చంద్రార్ఘ్యాది కార్యక్రమాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలి.

దీనినే చాతుర్మాస్య ద్వితీయ అని అంటారు.ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా కూడా ప్రసిద్ధి చెందింది.

శ్రావణ బహుళ తదియ రోజు తుష్టి ప్రాప్తి తృతీయ వ్రతం.బహుళ చవితి రోజు గోపూజ చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Shiva Vrat, Shriraghavendra, Sravanamasam-Latest News

శ్రావణ బహుళ పంచమిని రక్ష పంచమి వ్రత దినమంటారు.తిథి నాడు హల షష్టి వ్రతం ఆచరించాలి.ఈరోజునే బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి.ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవము.కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు.కాబట్టి గోకులాష్టమి అని అంటారు.

శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, విజయం సిద్ధిస్తుందని పురాణోక్తి.అష్టమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగించి ఉయ్యాలలో కట్టి ఆడిస్తారు.

బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శంగా విధుల్లో ఉట్టి కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

Telugu Bhakti, Devotional, Shiva Vrat, Shriraghavendra, Sravanamasam-Latest News

ఈ రోజు చండికా పూజ, కౌమార పూజ ఆచరిస్తారు. రామకృష్ణ పరమహంస( Ramakrishna Paramahamsa ) వర్ధంతి కూడా ఈరోజే చేస్తారు.రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించాడు.

ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube