చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్న సమంత... ఎమోషనల్ పోస్ట్ చేసిన హెయిర్ స్టైలిస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha) గత కొంతకాలం క్రితం మయోసైటిస్( Myositis ) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయంమనకు తెలిస్తే కొంతకాలం పాటు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నప్పటికీ పూర్తిగా నయం కాలేదని అందుకే సమంత కమిట్ అయినటువంటి ప్రాజెక్ట్ అన్నీ కూడా షూటింగ్ పూర్తిచేసుకుని ఏడాది పాటు సినిమాలకు దూరం అవుతూ చికిత్స తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే సమంత నిజంగానే చికిత్స కోసం అమెరికా వెళుతుంది అంటూ తాజాగా ఆమె హెయిర్ స్టైలిస్ట్ ( Hair Stylist ) కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 Samantha Going Abroad For Treatment, Samantha ,vijay Devarakonda ,khushi , Hair-TeluguStop.com

ఈ క్రమంలోనే సమంతతో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.ఈ రెండేళ్ల కాలంలో ఒక సెన్సేషనల్ మ్యూజిక్ వీడియో మూడు సినిమాలు, ఏడు బ్రాండ్ క్యాంపెయిన్స్, రెండు ఎడిటోరియల్స్, ఇంకా లైఫ్ టైం టైం గుర్తుండిపోయే మెమోరీస్.ఎండ వాన లేకుండా వర్క్ చేశాం.ఎన్నో నవ్వులు, సంతోషాలు, కన్నీళ్లు, బాధలు.అన్నిటిని నవ్వుతు స్వీకరించాం.ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూశాం.

 అవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రయాణమే అయితే ఇప్పుడు మీరు చికిత్స కోసం వెళుతున్నారు.

నాకు మీపై చాలా నమ్మకం ఉంది మీరు చికిత్స పూర్తి తీసుకుని తిరిగి రెట్టింపు శక్తితో వస్తారని భావిస్తున్నాను.మిమ్మల్ని కలిసే ఆ రోజు కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాను అంటూ ఈ సందర్భంగా సమంత హెయిర్ స్టైలిస్ట్ సమంత గురించి చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి ఆమె అభిమానులు ఈమె నిజంగానే చికిత్స కోసం అమెరికా వెళుతుందని అయితే క్షేమంగా పూర్తిగా ఆ వ్యాధి నుంచి బయటపడి తిరిగి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఈమె సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో కలిసి ఖుషి(Khushi) సినిమాలో నటించారు.అలాగే సిటాడెల్( Citadel ) అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube