హీరోలకు ఎత్తు, పొడుగు, అందం అవసరం కానీ కమెడియన్లకు ఒక్క టాలెంట్ ఉంటే సరిపోతుంది.తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ నరేష్ నుంచి సిల్వర్ స్క్రీన్ బాబు మోహన్ వరకు ఎందరో కమెడియన్లు కేవలం తమ ప్రతిభతోనే ఎంతో బాగా నవ్వించారు.
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కమెడియన్లకు కొదవలేదు.వారిలో టాప్ కమెడియన్లలో యోగి బాబు ఒకడిగా నిలుస్తున్నాడు.
ప్రత్యేకమైన లుక్స్‌తో మంచి కామెడీ టైమింగ్‌తో అలరిస్తున్న ఈ కమెడియన్ ఇటీవల కాలంలో బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు.2009లో వచ్చిన కోలీవుడ్ మూవీ యోగితో ప్రేక్షకులకు సుపరిచితుడైన ఈ నటుడు తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.ఈ నటుడిలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంది.అదే సైలెంట్ గా కామెడీ చేయడం.అతడు చేసే సైలెంట్ కామెడీ పొట్ట చెక్కలు అయిపోయి చచ్చేంతలా నవ్వేలా చేస్తుంది.యోగి బాబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
ఈ కమెడియన్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.వాటన్నిటి ద్వారా యోగి బాబు( Yogi babu ) టాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యాడు.
రీసెంట్‌గా అతడు లవ్ టుడే, బిచ్చగాడు 2 తెలుగు వెర్షన్ల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను బాగా నవ్వించాడు.
ప్రస్తుతం కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో యోగి బాబుకి పోటీ ఇచ్చే కమెడియన్ లేడు.అలాగే అతడికి ఉన్న డిమాండ్ మరే ఇతర హాస్యనటుడికి కూడా లేదు.అందుకే ఈ నటుడి రెమ్యూనరేషన్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకోపోకుండా పెరిగేసింది.సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం లాంటి దిగ్గజ కమెడియన్లు ఒక్కరోజు కాల్ షీట్ కి రూ.4-6 లక్షలు తీసుకుంటున్నారు.వెన్నెల కిషోర్ ( Vennela Kishore )లాంటివారు ఇంకా తక్కువ డబ్బుతోనే సర్దుకుంటున్నారు.అయితే యోగి బాబు మాత్రం ఒక్కరోజు కాల్ షీట్ కి ఏకంగా రూ.18 లక్షలు పుచ్చుకుంటున్నాడు.అంటే ఒక సినిమాలో అతడు పది రోజులు యాక్ట్ చేస్తే దాదాపు రెండు కోట్లు సంపాదిస్తాడు.
అయితే చాలా సాధారణంగా కనిపించే యోగి బాబు ఈ రేంజ్ లో డబ్బులు పొందుతున్నాడని తెలిసి కోలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అవాక్కవుతోంది.