జయసుధ భర్త దగ్గరికి వెళ్లి జయని పెళ్లి చేసుకుంటానని చెప్పాను... జెడి కామెంట్స్ వైరల్!

ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జెడీ చక్రవర్తి( JD Chakravarthy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం దయ( Daya ) అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

 I Went To Jayasudha's Husband And Told , Jayasudha, Jd Chakravarthy, Nithin, Mar-TeluguStop.com

ఇలా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జెడి చక్రవర్తి జయసుధ( Jayasudha ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను ఒకరోజు జయసుధ భర్త నితిన్ ( Nithin ) గారి వద్దకు వెళ్లి నితిన్ నేను జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను.అతను దాదాపు సిక్స్ ఫీట్ ఉన్నారు.లాగిపెట్టి కొడితే మూడు నెలల పాటు పైకి లేయను కానీ డేర్ చేసి తనని అడిగాను.అయితే నేను సరదాగా అంటున్నాను అన్న విషయం ఆయనకి కూడా తెలుసు.

ఇలా జయని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే నితిన్ ఒక్కటే మాటే అన్నారు.

నాకు జయసుధ నితిన్ పెళ్లి డేట్ సరిగా గుర్తులేదు.ఉదాహరణకు మే 17వ తేదీ అని చెబుతున్నాను.ఆ రోజు నువ్వు జయసుధని పెళ్లి చేసుకో ఎందుకంటే మా పెళ్లి రోజు కూడా అదే పెళ్లి రోజు( Marriage Date ) ఇద్దరిదీ సేమ్ అవుతుంది.

హస్బెండ్ మాత్రమే మారుతాడు అంటూ ఆయన సమాధానం చెప్పారు అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను జెడీ చక్రవర్తి గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే జయసుధ భర్త అనారోగ్య సమస్యలతో గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube