త్రిష పారితోషికం.. ఆ వార్తలన్నీ పుకార్లు

నాలుగు పదుల వయసు… రెండు పదుల సినీ కెరీర్‌ అనుభవం.పుష్కర కాలంకు పైగా స్టార్‌ హీరోయిన్ హోదా… ఇప్పటికి కూడా సీనియర్ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌.

 Trisha Remuneration For New Movies,trisha,ponniyin Selvan,tollywood,trisha Remun-TeluguStop.com

ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది.మరెవ్వరో కాదు తమిళ స్టార్‌ హీరోయిన్‌ త్రిష( Heroine Trisha ).

ఈమె కెరీర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు.తమిళ సూపర్‌ స్టార్ విజయ్ కి జోడీగా ఒక సినిమా ను చేస్తున్న త్రిష మరో వైపు తెలుగు లో చిరంజీవికి జోడీగా ఎంపిక అయ్యింది.

Telugu Tamil, Top, Trisha-Movie

ఇటీవలే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌ సినిమా( Ponniyin Selvan ) లో నటించడం ద్వారా మళ్లీ పాన్ ఇండియా రేంజ్ లో త్రిష గురించి మాట్లాడుకుంటున్నారు.పొన్నియిన్‌ సెల్వన్ సినిమా లో ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) కీలక పాత్ర లో నటించింది.ఆ పాత్రను డామినేట్‌ చేసే విధంగా త్రిష పాత్ర ఉంది.త్రిష అందంగా కనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో త్రిష యొక్క అందాల ఆరబోత గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.ఇదే సమయంలో త్రిష ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయలు తీసుకుంటుంది అంటూ ఒక వార్త ప్రధానంగా వైరల్‌ అవుతోంది.

Telugu Tamil, Top, Trisha-Movie

కొన్ని జాతీయ మీడియా సంస్థ లు కూడా త్రిష పారితోషికం( Heroine Trisha Remuenration ) పది కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నాయి.తాజాగా ఈ విషయం పై ఒక తమిళ మీడియా సంస్థ స్వయంగా త్రిష ను సంప్రదించడం జరిగిందట.అందులో నిజం లేదని.తన ఇమేజ్ కు తగ్గట్లుగా మంచి పారితోషికం వస్తుందని చెప్పిందట.ఆమె తరపు వారు ఆఫ్ ది రికార్డ్‌ పది కోట్ల పారితోషికం నిజం కాదు.పాత్ర పరిధి మరియు ప్రాముఖ్యత బట్టి పారితోషికం ఇస్తారు.

ఇప్పటి వరకు రెండున్నర కోట్ల నుండి అయిదు కోట్ల వరకు త్రిష పారితోషికం తీసుకుంటున్నట్లుగా వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పుకొచ్చారు.కనుక త్రిష పది కోట్ల పారితోషికం అనేది పూర్తిగా అవాస్తవం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube