ఆ స్మగ్లింగ్ కేసులో మళ్లీ పట్టుబడిన జబర్దస్త్ కమెడియన్.. పద్ధతి మార్చుకోవాలంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ షో( Jabardasth Show ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ షో, అందులో ఉన్న కమెడియన్లు సుపరిచితమే.

 Jabardasth Hari Jabardast Comedian Hari Absconding In Red Sandalwood Smuggling C-TeluguStop.com

కొన్ని ఏళ్లుగా ఈటీవీలో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది జబర్దస్త్ షో.కాగా మొన్నటి వరకు జబర్దస్త్ షోలో లేడీ కంటెస్టెంట్ లు తక్కువగా ఉండి లేడీ గెటప్ వేసేవారు ఎక్కువగా ఉండేవారు.కానీ ఈ మధ్యకాలంలో లేడీ గెటప్ లతో పోల్చుకుంటే లేడి కంటెస్టెంట్ లు ఎక్కువగా వస్తున్నారు.అలా లేడీ గెటప్స్ వేసి చాలామంది పాపులరిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Telugu Hari, Jabardast, Red Sandalwood, Sandalwood-Movie

అటువంటి వారిలో శాంతి స్వరూప్, పవన్, చిన్మయి, కొమరం, హరి, వినోద్, ఇలా చాలామంది లేడీ గెటప్పులు వేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.వారిలో కమెడియన్ హరి( Comedian Hari ) విషయానికి వస్తే.తాజాగా హరికు సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.తాజాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్‌ హరి అలియాస్ హరిత పై కేసు నమోదు అయ్యింది.

చంటి టీమ్‌లో లేడీ గెటప్‌లు( Lady Getups in Chanti Team ) వేసే హరిత తెర వెనుక గట్టుచప్పుడుకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో దాదాపు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.

Telugu Hari, Jabardast, Red Sandalwood, Sandalwood-Movie

దర్యాప్తులో అతను హరి పేరు చెప్పడంతో అసలు విషయం బయటపడింది.ఈ వ్యవహారంతో హరికి సంబంధం ఉందని, సరుకు ను తరలించే ప్లాన్ కూడా అతడిదేనని పోలీసులకు వెల్లడించాడు.ఈ ఆపరేషన్‌లో హరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ట్రై చేసినప్పటికీ, తమ కళ్లుగప్పి అతను తప్పించుకొని పారిపోయినట్లు పోలీసుల తెలిపారు.

దాంతో పోలీసులు హరిపై కేసు నమోదు చేశారు.పరారీలో ఉన్న హరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అయితే స్మగ్లింగ్ కేసులో హరి ఇప్పటికే చాలాసార్లు పట్టుబడ్డాడని ఇప్పటికి చాలా కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.2021 మే నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో 8 మంది స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.కానీ జబర్దస్త్‌ హరి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు.హరికి చాలా మంది స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube