చెరుకు పంటను కన్ను మచ్చ తెగులు నుండి సంరక్షించే పద్ధతులు..!

చెరుకు పంటను( Sugarcane Crop ) ఆశించే కన్ను మచ్చ తెగులు బీజాంశం ద్వారా వ్యాపిస్తుంది.చెరకు మొక్కలకు గాయాలు అయిన సందర్భంలో గాలి, వర్షం ద్వారా వ్యాప్తి పెరుగుతుంది.

 How To Treat Eye Spot Disease On Sugarcane Details, Eye Spot Disease ,sugarcane-TeluguStop.com

ఇక పొలంలో అధిక తేమా( Moisture ) ఉంటే కూడా ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.చెరుకు ఆకులపై( Sugarcane Leaves ) రెండు వైపులా ఎరుపు మచ్చలు ఏర్పడి తర్వాత గోధుమ రంగు లోకి మారితే వాటిని కన్ను మచ్చ తెగులుగా నిర్ధారించుకోవాలి.

ఈ తెగులు సోకిన చెరుకు మొక్కలు 15 రోజులలోపు ఎండిపోయి చనిపోతాయి.ఈ తెగులు సోకిన ఆకుల మధ్య భాగం బూడిద లేదా తోలు రంగులోకి మారుతుంది.

Telugu Agriculture, Eye Spot, Moisture, Sugarcane, Sugarcane Crop, Weeds-Latest

ఈ తెగులు పంటను ఆశించకుండా ముందుగా తెగులను తట్టుకునే మేలురకం చెరుకు కాడలను పొలంలో నాటుకోవాలి.పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.మొక్కలకు సూర్యరశ్మి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా విత్తుకోవాలి.చెట్టు మొదల వద్ద ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.భూమిని వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆఖరి దుక్కులో పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి.

పంట వేసే ముందు పొలాన్ని పరిశుభ్రం చేయాలి.పొలం చుట్టూ ఉండే గట్లపై గడ్డి ఇతర రకాల కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి.

Telugu Agriculture, Eye Spot, Moisture, Sugarcane, Sugarcane Crop, Weeds-Latest

పొలంలో నీటి తడులు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా పొలాన్ని చదునుగా తయారు చేసుకోవాలి.వాతావరణం లో మార్పు జరిగినప్పుడు పంటను వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది.కాబట్టి అటువంటి సమయాలలో పంటను జాగ్రత్తగా గమనించి తెగుళ్లను గుర్తించి సంరక్షక చర్యలు చేపట్టాలి.కన్ను మచ్చ తెగులను గుర్తించి ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి నాశనం చేయాలి.తరువాత ఒక లీటరు నీటిలో 0.2% కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిపి పంటకు పిచికారి చేయాలి.లేదంటే లీటరు నీటిలో 0.3% మాంకోజెబ్ కలిపి పంటకు పిచికారి చేయాలి.ఇలా 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే ఈ తెగుల నుండి పంటను సంరక్షించబడి అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube