హెయిర్ కటింగ్‌కు మాములుగా అయితే రూ.100 లేదా లగ్జరీ సెలూన్‌లో అయితే రూ.300 వరకు ఉంటుంది.అదే అల్ట్రా లగ్జరీ సెలూన్‌కి వెళితే రూ.500 వరకు ఉండొచ్చు.కానీ ఒక వ్యక్తి హెయిర్ కటింగ్‌కు నెలకు రూ.16 లక్షలు ఖర్చు చేస్తున్నాడు.అంతేకాదు ఆయనకు కటింగ్ చేసేందుకు బార్బర్ ప్రత్యేక విమానంలో ఆయన ఇంటికి వెళతారు.
నెలకు రెండుసార్లు ఆయన ఇంటికి వెళ్లి సర్వీసులు అందిస్తాడు.ఇందుకుగాను రూ.16 లక్షలు ఖర్చవుతుంది.ఇంతకు అంత ఖర్చు పెట్టి కటింగ్ చేయించుకునే వ్యక్తి ఎవరో తెలుసా.
ఒక చిన్న దేశమైన బ్రూనై దేశపు రాజు మస్సనల్ బోల్కియా ఇబ్న్( King Massanal Bolkiah Ibn ) ఉమర్ అలీ సైఫుద్దీన్( Umar Ali Saifuddin ) ప్రతి నెలా కటింగ్ కోసమే రూ.16 లక్షలు ఖర్చు అవుతుందట.ఆయనకు బాగా ఆస్తులు ఉన్నాయి.రూ.1.4 లక్షల కోట్ల ఆస్తులతో పాటు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద ప్యాలెస్ ఉంది.ప్యాలెస్ లోని గోడలపై బంగారు పూత ఉంటుంది.
ఈ ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో నిండి ఉంటుందని చెబుతున్నారు.ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే కోట్లాది రూపాయాలు ఖర్చు అవుతున్నాయి.
ఇక రాజు ఇచ్చే విందులు మాములుగా ఉండవు.విందులలో బంగారపు ప్లేట్లను వినియోగిస్తారు.
అయితే కొంతమందికి మాత్రమే రాజు ఉండే ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.ఎవరు పడితే వారు వెళ్లడానికి ఉండదు.ఈ ప్యాలెస్‌లో 1788 గదులతో పాటు 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి.
అలాగే 110 గ్యారేజీలతో పాటు 2300 గుర్రాల కోసం ఏసీ సదుపాయం ఉండే లాయం కూడా ఉన్నాయి.అలాగే 800 కార్లు ఒకేసారి పార్కింగ్ చేయడానికి పెద్ద గ్యారేజ్ కూడా ఉంది.
రాజుకి హెయిర్ కటింగ్ చేయడానికి స్ట్రైలిష్‌ని ప్రైవేట్ ఛార్టర్డ్ ద్వారా లండన్ నుంచి విమానంలో తీసుకొస్తారు.