మొక్కజొన్న లో తుప్పు తెగులును అరికట్టే పద్ధతులు..!

మొక్కజొన్న సాగుకు( Corn crop ) వ్యాపించే తుప్పు తెగులు పుక్కినియా సోర్గి అనే ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.ఈ తెగులు గాలి, వర్షం వల్ల వ్యాప్తి చెందుతాయి.

 Reduce The Incidence Of Corn Rust , Corn ,corn Crop,pest Infestation , Agricult-TeluguStop.com

అధిక తేమ ఉంటే మొక్క ఆకులపై ఈ తెగులు సోకుతాయి.అధిక ఉష్ణోగ్రత ఉంటే ఈ తెగుల వ్యాప్తి జరగదు.

ఈ తెగులు సోకితే ఆకులపై చిన్న చిన్న మచ్చలు బుడిపెల రూపంలో కనిపిస్తాయి.తరువాత ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారిన తర్వాత ఆకులు, బొమ్మలు బలహీనంగా తయారవుతాయి.

ఆకులో ఎదుగుదల లోపిస్తుంది.మొక్క ఎదిగే సమయంలో ఇవి నల్లగా మారతాయి.

లేత మొక్కజొన్న ఆకులకు ఈ తుప్పు తెగుల వ్యాప్తి అధికంగా జరుగుతుంది.ఈ తెగుల వల్ల సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.

కాబట్టి తెగులను తట్టుకునే మేలురకం మొక్కజొన్న విత్తనాలను పొలంలో నాటుకోవాలి.పొలంలో మొక్కల మధ్య, సాల్ల మధ్య దూరం ఉండాలి.ఎందుకంటే మొక్కలకు సూర్యరశ్మి( Sunshine ), గాలి బాగా తగిలితే ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉండదు.ఇక ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.

కలుపు ను సకాలంలో తొలగిస్తే సగానికి పైగా చీడపీడల బెడద( Pest ), తెగుళ్ల బెడద తప్పుతుంది.

Telugu Agriculture, Corn, Corn Crop, Farmers, Latest Telugu, Pest, Sunshine-Late

పొలంలో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా వాతావరణంలో తేమ ఉన్నప్పుడు పంటకు నీటి తడులు అందించకూడదు.పొలం బెట్ట పడుతున్న సమయంలో నీటి తడి అందించాలి.

పంటకు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏవైనా తెగుల లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.ఇలా చేస్తే తెగుల వ్యాప్తి తగ్గుతుంది.

Telugu Agriculture, Corn, Corn Crop, Farmers, Latest Telugu, Pest, Sunshine-Late

ఈ తెగులను పొలంలో గుర్తించిన తర్వాత అరికట్టేందుకు క్రిస్టల్ ఎం-45, ఇండోఫిల్ ఎం-45, డిథానే ఎం-45 లాంటి వాటిలో ఏదో ఒక రసాయన పిచికారి మందులు ఎంచుకుని ఈ తుప్పు తెగులను నివారించాలి.ఈ తెగులను సకాలంలో నివారించకపోతే సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube