ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపు నిర్వాహకుల చర్యలు.. కనిపించని ఎక్సైజ్ శాఖ..!?

తెలంగాణలోని పలు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది.బెల్ట్ షాపులే( Belt Shops ) కేంద్రంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.

 Excise Department No Action On Belt Shops Details, Auction , Bhadradri Kothagude-TeluguStop.com

అయితే కొన్ని గ్రామాల్లో ఈ షాపుల నిర్వహణను వేలంపాట ద్వారా చేపడుతుంటారు.ఈ క్రమంలోనే బెల్ట్ షాపు నిర్వహాకులు చేసిన ఓ పని వివాదంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Bhadradri Kothagudem ) చండ్రుగొండ మండలంలోని గానుగపాడు గ్రామంలో ఉన్న మద్యం దుకాణాన్ని గత రెండేళ్లుగా వేలంపాట ద్వారా నడుపుతున్నారు.

ఇందులో భాగంగా రెండు నెలల క్రితం రూ.3 లక్షలకు వేలం పాడిన వ్యక్తి బెల్ట్ షాపు నిర్వహణను తీసుకున్నారు.ఆ డబ్బును గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి వెచ్చించేందుకు సిద్దం అయ్యారు.

అయితే గ్రామానికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు చర్చి అభివృద్ధికి డబ్బు ఇవ్వాలని కోరారు.ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో మరో బెల్డ్ షాపు ఏర్పాటుకు వేలం నిర్వహించారు.

ఈ విధంగా రెండు మద్యం దుకాణాలు ఏర్పాటు కావడంతో మా షాపులోనే తాగాలంటే మా షాపులోనే తాగాలంటూ రెండు వర్గాలు చాటింపు వేయించాయి.ఈ క్రమంలోనే మొదటి షాపు నిర్వహకులు మరో అడుగు ముందుకేసి తమ షాపును కాదని కొత్త షాపులో మద్యం తీసుకుంటే రూ.5 వేల జరిమానా అంటూ దండోరా వేయించారు.దీంతో ఎక్కడ మద్యం తాగాలో తెలియక మందుబాబులు సతమతం అవుతున్నారు.

మద్యం ఏరులై పారుతున్నా, బెల్ట్ షాపు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయాలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube