ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీల వివాదం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.
పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కలిసి మాజీ మంత్రి బాలినేని అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో ఘర్షణ చెలరేగింది.దీనిపై స్పందించిన జనసేన పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
వైసీపీ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జనసేన వర్గం చింపివేయగా.వారి ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చింపివేశారు.
ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.