ప్రధానమంత్రి మోడీ( PM Modi ) నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీప్రభుత్వం నవ వసంతాలు పూర్తి చేసుకుంది .ఈనెల 30వ తారీఖుతో భాజాపా ప్రభుత్వానికి 9 సంవత్సరాలు పూర్తవుతాయి .2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అప్రతిహతంగా దూసుకుపోతున్న భాజాపా, మోడీ ఇమేజ్ ,అమిత్ షా చాణక్యంతో మరోసారి అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటుంది.భారత ప్రజలకు తాము అందించిన సంక్షేమ పథకాలు తమ అభివృద్ధి విధానాలే మరోసారి తమను గెలిపిస్తాయని కమలనాధులు ధీమాగా ఉన్నారు.
తొమ్మిదేళ్ల బిజెపి పరిపాలనలో ఆ పార్టీ విజయాలను అపజయాలను ఒకసారి పరిశీలిస్తే జీఎస్టీ విధానం అమలు, అద్భుతమైన హైవేల నిర్మాణం, రాజకీయ అవినీతి చాలా వరకు కంట్రోల్ చేయగలగటం, అగ్రవర్ణాలలో బలహీన వర్గాల కోసం ఈ డబ్ల్యూ ఎస్ కోటా ని అమలు చేయగలగటం ….స్వచ్ఛభారత్ లాంటి విషయాలలో భాజపా ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయి… శాంతి భద్రతలను కూడా కాపాడగలటం భాజాపాకు కలిసి వచ్చింది … శాంతిభద్రతలు పరంగా భాజపా హాయములో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడం ఈ ప్రభుత్వ ఘనత గానే చెప్పాలి.
బ్యాంకుల విలీనంపై మిశ్రమ స్పందన వచ్చింది.ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణని వంటి విషయాలపై దేశంలోని కొన్ని వర్గాల నుంచి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ….ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాలను మతాలను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది.అంతేకాకుండా రైతు చట్టాల ( New Farm Acts )విషయంలో కూడా రైతులను బాగా ఇబ్బంది పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి .మరోవైపు అంతర్జాతీయ పథకాలను గెలుచుకున్న అథ్లెట్ ల ఆందోళన విషయంలో ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వ్యవహార శైలి కూడా విమర్శలపాలవుతుంది.అదానీ కంపెనీలకు ఉద్దేశపూర్వకంగా మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించాయి.
ప్రతిపక్షాలను పట్టించుకోనట్లుగా వ్యవహరించడం….రాహుల్ గాంధీ (Rahul Gandhi )విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి./br>
ఇలా తొమ్మిదేళ్ల పాలనలో మెజారిటీ వర్గాలను మెప్పిస్తున్నప్పటికీ మైనారిటీల విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి కొంత వివాదాస్పదం అవుతుంది.అయితే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు .అవినీతి లేని తమ పరిపాలన తమను గెలిపిస్తాయని భాజపా నమ్ముతుంది.మోడీ చరిష్మాయే తమ ఎన్నికల అస్త్రంగా మరోసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటుంది
.