కర్నాటక దెబ్బకు.. బీజేపీ థింకింగ్ మారే !

కర్నాటక ఎన్నికల ప్రభావం బీజేపీని( BJP ) గట్టిగానే దెబ్బ తీసింది.కచ్చితంగా గెలుస్తామని కుండ బద్దలు కొట్టిన కమలనాథులకు కన్నడిగులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.

 What Is Bjp's Plan? ,bandi Sanjay ,etela Rajender,bjp, Ts Politics, Karnataka El-TeluguStop.com

దీంతో బీజేపీ నేతల థింకింగ్ మారిపోయినట్లు తెలుస్తోంది.ఇప్పుడు కమలనాథుల దృష్టంతా తెలంగాణ పై పడింది.

కర్నాటక మాదిరి వైఫల్యం తెలంగాణలో ఎదుర్కొకూడదని బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే లోటుపాట్లను సరి చేసుకునే పనిలో ఉన్నారు.ముఖ్యంగా పార్టీని ముందుకు నడిపించే నాయకుడి విషయంలో బీజేపీ ఇప్పుడు పునఃఆలోచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Brsamit Shah, Congress, Etela Rajender, Karnataka, Ts-Politics

ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్( Bandi Sanjay ) కొనసాగుతున్నారు.అయితే బండి దూకుడు స్వభావం ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కులు కొని తెస్తారో ఊహించలేని పరిస్థితి.కొన్ని సార్లు బండిసంజయ్ చేసే వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని కూడా కలవరపరుస్తుంటాయి.దీంతో బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈసారి ఎన్నికల వరకు బండినే కొనసాగించాలని అధిష్టానం భావించింది.తీర ఇప్పుడు కర్నాటక ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ థింకింగ్ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించి.ఈటెల రాజేందర్ కు ఆ బాద్యతలు అప్పగించే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Brsamit Shah, Congress, Etela Rajender, Karnataka, Ts-Politics

ఈ వార్తలకు బలం చేకూర్చేలా.ఇటీవల ఈటెల రాజేందర్ కు డిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కాదని ఈటెల కు పిలుపు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.అయితే డిల్లీ పెద్దలు ఈటెల తో( Etela Rajender ) ఎందుకు సమావేశం అయ్యారు ? ఆయన తో ఏం చర్చించారు ? అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఈటెల డిల్లీ ప్రయాణంపై బండి సంజయ్ ఆసక్తికరంగా స్పందించారు.ఈటెల ను అధిష్టానం ఎందుకు పిలిచిందో తనకు తెలియదని, తాను మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

ఒకవేళ ఎన్నికల ముందు రాష్ట్ర అద్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పిస్తే.ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరమే.

మొత్తానికి కర్నాటక ఇచ్చిన స్ట్రోక్ తో బీజేపీ తెలంగాణపై మరింత జాగ్రత్తగా అగుడులు వేస్తుందనే చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube