లేడీ డైరెక్టర్ కి కాలం కలిసి వచ్చి మంచి శకునం మొదలయ్యేనా?

2011 సంవత్సరంలో అలా మొదలైంది అంటూ దర్శకురాలిగా కెరీర్ ను ప్రారంభించిన నందిని రెడ్డి( Nandini Reddy ) మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా సాధించిన విజయంతో ఆ వెంటనే జబర్దస్త్‌ అనే సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది.

 Nandini Reddy Anni Manchi Shakunamule Movie Release This Week , Anni Manchi Sha-TeluguStop.com

కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.సిద్దు( Siddhu ) మరియు సామ్( Sam ) కలిసి ఆ సినిమా లో నటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా ఫ్లాప్ నుండి బయట పడటానికి మూడు సంవత్సరాలు పట్టింది.ఆ తర్వాత కళ్యాణ వైభోగమే అనే సినిమా ను చేసిన విషయం తెల్సిందే.

ఆ సినిమా కూడా డిజాస్టర్‌ గా నిలిచింది.దాంతో మళ్లీ మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సమంత తో ఓ బేబీ అనే సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే.

పిట్ట కథలు అనే సిరీస్ కు ఒక ఎపిసోడ్‌ కి దర్శకత్వం వహించింది.అన్ని మంచి శకునములే( anni manchi shakunamule ) సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తో మరోసారి నందిని రెడ్డి దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

Telugu Annimanchi, Malavika Nair, Nandini Reddy-Movie

ఈ సినిమా లో సంతోష్ శోభన్ హీరోగా నటించగా మాళవిక నాయర్( Malvika Nair ) హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.హీరోగా సంతోష్‌ శోభన్ హీరో గా వరుసగా సినిమా లు చేస్తూ దూసుకు పోతున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తో ఆయనకు ఎలాంటి ఫలితం దక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు మహానటి ఫేం స్వప్న సినిమాస్‌ వారు నిర్మించారు.

తాజాగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.సినిమా పై చాలా పాజిటివ్ గా ఉన్నారు.అన్ని విధాలుగా ఈ సినిమాకు మంచి శకునములు కనిపిస్తున్నాయి.కనుక నందిని రెడ్డికి అన్ని మంచి శకునాలే అయ్యి ఉండవచ్చు అంటూ ఆమె సన్నిహితులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube