అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు.మొన్నటిదాకా దాకా ఇల్లు, వాకిలి లేని వారికి నేడు పెద్ద భవంతులలో ఏసీ రూములలో లగ్జరీ పరుపులపై పడుకొనే భాగ్యం దక్కింది.
దానికి కారణం అదృష్టమని చెప్పవచ్చు.అదృష్టం చాలా రూపాలలో వరిస్తుంది.
వాటిలో లాటరీ ఒకటని చెప్పవచ్చు.ఈ లాటరీ కూటికి కూడా లేని వారిని కోటీశ్వరులను చేసింది.
ఈ జాబితాలోకి తాజాగా మరొక మహిళ చేరింది.
వివరాల్లోకి వెళ్తే.యూఎస్( US )కి చెందిన లూసియా ఫోర్సేత్( Lucia Forsyth ) అనే మహిళ కొన్ని ఎలా క్రితం వరకు ఇల్లు లేక బజార్ల వెంటే జీవించింది.అలా జీవనం గడుపుతూ ఒక రోజు స్క్రాచర్స్ టిక్కెట్ కొనుగోలు చేసింది.
కాగా ఆమె కొనుగోలు చేసిన టిక్కెట్‌కి 5 మిలియన్ డాలర్ల అమౌంట్ తగిలింది.అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.40 కోట్లు.దాంతో ఒక్కసారిగా ఈ మహిళ కోటీశ్వరాలు అయ్యింది.
ఈ అదృష్టవంతురాలు పిట్స్‌బర్గ్( Pittsburgh )లోని వాల్‌మార్ట్ సూపర్‌సెంటర్‌లో టిక్కెట్‌ను కొనుగోలు చేసింది.ఏది కొనాలో ఎంచుకోవడానికి ఆమె కళ్ళు మూసుకుంది.ప్రారంభంలో, ఆమె మరొక ఉచిత టిక్కెట్‌ను మాత్రమే గెలుచుకున్నట్లు భావించింది.
అయితే ఆమె 5 మిలియన్లను గెలుచుకున్నట్లు ఆ తర్వాత గ్రహించింది.లూసియా ఒక శాశ్వత ఇంటిని కొనుగోలు చేయడానికి, భవిష్యత్తులో కొంత పెట్టుబడి పెట్టడానికి డబ్బును ఉపయోగించాలని యోచిస్తోంది.ఈ సంగతి తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
అదృష్టం, అలాగే రాసిపెట్టి ఉంటే ఇలాగే సడన్‌గా కోటీశ్వరులు కావచ్చని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.