దేశం విడిచి వెళ్లకుండా వారిపై బ్యాన్ విధించిన చైనా..

కోవిడ్-19 ఆంక్షల తర్వాత వ్యాపారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని చైనా చెబుతూ వస్తోంది.కానీ మరోవైపు విదేశీ ఎగ్జిక్యూటివ్‌లతో సహా కొందరు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి చైనా నిష్క్రమణ నిషేధాలను ఎక్కువగా ఉపయోగిస్తోంది.

 China Has Banned Them From Leaving The Country , China, Exit Bans, Foreigners, H-TeluguStop.com

ఇలా రెండు నాల్కల ధోరణితో చైనా( China ) ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేస్తోంది.చైనా ప్రభుత్వం ఆర్థిక, రాజకీయ, భద్రతాపరమైన ఆందోళనలు పడుతోందని, అందుకే ఈ బ్యాంక్స్ విధిస్తోందని తెలుస్తోంది.

మానవ హక్కుల గ్రూప్ అయిన సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ ప్రకారం, అనేకమంది చైనీస్, విదేశీయులు ఈ నిష్క్రమణ నిషేధాల వల్ల ప్రభావితమయ్యారు.అయితే ఇటీవలి సంవత్సరాలలో ఈ తరహా నిషేధాలకు సంబంధించిన కోర్టు కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.చైనా ఎగ్జిట్ బ్యాన్స్( China exit bans ) కోసం చట్టపరమైన భూభాగాన్ని కూడా విస్తరించింది.2012లో అధ్యక్షుడు జి జిన్‌పింగ్( Zi Jinping ) అధికారం చేపట్టినప్పటి నుంచి వాటిని ఎక్కువగా ఉపయోగించింది.1995, 2019 మధ్య కాలంలో పదివేల మంది చైనీయులు దేశం విడిచి వెళ్లకుండా బ్యాన్ విధించినట్లు అంచనా.

Telugu China, Exit Bans, Foreigners, International, Travel-Latest News - Telugu

ఇక చైనా అధికారులు 128 మంది విదేశీయులు బయటకు వెళ్లకుండా నిషేధించారు.చైనా సుప్రీం కోర్ట్ డేటాబేస్ నుంచి రికార్డులు 2016 – 2022 మధ్య నిష్క్రమణ నిషేధాలను ప్రస్తావిస్తూ కేసులు ఎనిమిది రెట్లు పెరిగినట్లు చూపుతున్నాయి.చైనా ఇటీవల తన కౌంటర్-గూఢచర్య చట్టాన్ని సవరించింది.

ఈ సవరణ చట్టం ప్రకారం విచారణలో ఉన్న చైనీయులు ( Chinese )లేదా విదేశీయులు ఎవరి పైన అయినా నిష్క్రమణ నిషేధాలను విధించవచ్చు.

Telugu China, Exit Bans, Foreigners, International, Travel-Latest News - Telugu

ఎగ్జిట్ బ్యాన్‌ల వాడకం విదేశీ పెట్టుబడులు, ప్రయాణాలకు డోర్లు తెరుస్తుందనే చైనా సందేశానికి విరుద్ధంగా ఉంది.యూఎస్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో నిష్క్రమణ నిషేధాలు ఆందోళనలను పెంచుతున్నాయి.అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైనా పాలసీ కమిటీ అధిపతి లెస్టర్ రాస్( Lester Ross ) మాట్లాడుతూ, కంపెనీలను ఎలా సిద్ధం చేయాలి, తగ్గించాలి అనే దానిపై సలహాలు అడిగారు.

యూఎస్ డ్యూ-డిలిజెన్స్ సంస్థ మింట్జ్ గ్రూప్‌తో సహా అనేక విదేశీ సంస్థలు నిష్క్రమణ నిషేధాల వల్ల ప్రభావితమయ్యాయి.ఈ సంవత్సరం కనీసం ఒక సింగపూర్ ఎగ్జిక్యూటివ్ చైనాను విడిచిపెట్టకుండా నిరోధించారు.

విదేశీయులతో సహా ఎంత మంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా నిషేధానికి గురయ్యారో ఇంకా తెలియ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube