స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం రేయింబవళ్లు కష్టపడుతూ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు.ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల బడ్జెట్ దాదాపుగా 1500 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.
ఈ మూడు సినిమాలు ప్రభాస్ మార్కెట్ ను రెట్టింపు చేయడంతో పాటు అభిమానులకు కచ్చితంగా నచ్చుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఒక ఫ్యామిలీ స్టోరీలో( Family Story ) నటించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని ఫ్యామిలీ సినిమాలలో నటించారు.
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు ప్రభాస్ కు ఫ్యామిలీ ప్రేక్షకులలో మంచి పేరును తెచ్చిపెట్టాయి.ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఫ్యామిలీ టచ్ ఉన్న కథలో నటించలేదు.
మారుతి ప్రభాస్ కాంబో మూవీ( Prabhas Maruti ) కూడా అలాంటి సినిమా కాదని సమాచారం అందుతోంది.
ఒక నిర్మాతను ఈ తరహా కథ చూడాలని ప్రభాస్ కోరినట్టు సమాచారం.ప్రభాస్ దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా ఈ తరహా కథాంశంతో తెరకెక్కుతుందా? లేక కొత్త తరహా కథాంశంతో తెరకెక్కుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు జవాబు తెలియాల్సి ఉంది.
ప్రభాస్ క్రేజ్ కు ఆయన కోరితే ఏ డైరెక్టర్ కూడా నో చెప్పరు.
ప్రభాస్ తో ఒక సినిమా అయినా తెరకెక్కించాలని కలలు కంటున్న దర్శకుల సంఖ్య కూడా తక్కువేం కాదు.ప్రభాస్ పారితోషికం పెరుగుతున్నా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది.గత సినిమాల ఫలితాలు ప్రభాస్ మార్కెట్ పై అణువంత ప్రభావం కూడా చూపడం లేదు.
ప్రభాస్ ఫ్యామిలీ కథను ఎంచుకోవడం అంటే రిస్క్ చేస్తున్నట్టే అని కొంతమంది చెబుతున్నారు.