యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం( CM ) అయితే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.సీనియర్ ఎన్టీఆర్ మనవడు కావడం, రాజకీయాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం, ఇతర పార్టీలకు షాకిచ్చేలా విమర్శలు చేయడం జూనియర్ ఎన్టీఆర్ కు సొంతమనే సంగతి తెలిసిందే.
టీడీపీ( TDP ) బాధ్యతలు తారక్ తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందా లేదా? సీఎం కావాలనే కోరిక ఉందా? రాజకీయాల గురించి ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే ప్రశ్నలకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు సంబంధించి తారక్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.సీఎం కావాలనే ఆశ అందరికీ ఉంటుందని నా మేకప్ మేన్ కూడా సీఎం కావాలని ఆశిస్తాడని ఎన్టీఆర్ తెలిపారు.
రాజకీయాలు అంటే నా లైఫ్ లో అప్పుడే రాని పేజీలని బ్రతికినంత కాలం తాను టీడీపీ కార్యకర్తనని ఆయన చెప్పుకొచ్చారు.సీఎం కావాలంటే సులువు కాదని సాధన ఉంటే మాత్రమే సీఎం కావడం సాధ్యమవుతుందని తారక్ తెలిపారు.యాక్సిడెంట్ తర్వాత వచ్చిన జన్మను పునర్జన్మ అని భావిస్తానని ఆయన తెలిపారు.1995లో ఏం జరిగిందో తనకు తెలియదని అప్పుడు ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తే స్పందిస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
అయితే తారక్ దృష్టి పెడితే మాత్రం మరో 20 సంవత్సరాల తర్వాత అయినా సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం కావడం సాధ్యమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారో లేదో చూడాలి.