సోషల్ మీడియాలో ఏదైనా ఒక అంశం కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తే దాన్ని షేర్ చేసేందుకు ప్రముఖులు వెనుకాడరు.ఇక వారు షేర్ చేసిన వెంటనే సదరు కంటెంట్ వాల్యూ మరింత పెరుగుతుంది అని చెప్పుకోవాలి.
దాంతో అందులో వున్నవారికి మంచి గుర్తింపు దక్కుతుంది.ఇలాంటి మంచి వీడియోలను షేర్ చేసే ప్రముఖుల్లో మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర( Anand Mahindra ) ముందుంటారు.
తాజాగా ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ ( Modi )చేరిపోయారు అని చెప్పుకోవచ్చు.అవును, ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )తాజాగా ఓ వీడియోను షేర్ చేయగా అది కాస్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కర్నాటకకు చెందిన ‘షల్మాలీ’ అనే ఓ చిన్నారి పియానో( piano ) వాయించే వీడియోను ఆయన షేర్ చేయడం జరిగింది.ఆ వీడియోలో ఓ మహిళ కన్నడలో పాట పాడుతుండగా ఈ చిన్నారి దానికి తగ్గట్టుగా పియానో చాలా చక్కగా ప్లే చేయడం ఇక్కడ చూడవచ్చు.కాగా షల్మాలీ టాలెంట్‌కు ఇంటర్నెట్ ఫిదా అవుతోంది.అందులో ప్రధాని మోదీ షేర్ చేయడంతో ఈ వీడియోకు మరిన్ని లైక్స్ షేర్స్ రావడం కొసమెరుపు.“ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది.ఈ చిన్నారి టాలెంట్ అద్భుతం.
షల్మాలీకు నా అభినందనలు!” అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఇక ఈ వీడియో తిలకిస్తున్న నెటిజన్లు ఆ వీడియోలో వినిపించే మహిళ గొంతు ఆ చిన్నారి తల్లి అయి ఉంటుందని అంటున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కాగానే వెంటనే ప్రధాని మోదీ షేర్ చేయడంతో 5 లక్షల రెట్లు ఎక్కువగా వ్యూస్ రావడం విశేషం.కాగా ఈ చిన్నారి టాలెంట్‌ను చాలామంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఆమెని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులంటూ పోస్టులు చేస్తున్నారు.ఇంకొందరైతే ఈ చిన్నారికి ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందేనంటూ రాసుకొచ్చారు.