చిన్నప్పుడే తండ్రి పోయాడు ఎంగిలి బీడీలు ఏరుకొని బ్రతికా: బలగం నటుడు

తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ తన డైలాగ్ డెలివరీతో, తన బాడీ లాంగ్వేజ్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి వారిలో నటుడు కర్తానందం (Karthanandam)ఒకరు.ఒకానొక సమయంలో జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమంలో సందడి చేసిన ప్రస్తుతం వెండితెరపై పలు సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 His Father Passed Away When He Was Young And Survived By Picking Beedis Balagam-TeluguStop.com

తాజాగా బలగం(Balagam) దసరా (Dasara) వంటి సినిమాలలో నటించి సందడి చేసిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటారు.ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలను చెబుతూ కన్నీటి పర్యంతరమయ్యారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ మాది సూర్యపేట అనితాను పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు.ఇక తాము నలుగురు అన్నదమ్ములం కాగా ఒక చెల్లి మొత్తం ఐదుగురు సంతానం అని తెలిపారు.నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో అమ్మ రెక్కల కష్టంతో బ్రతికామని తెలియజేశారు.అమ్మ మా కోసం ఎంతో కష్టపడిందని అమ్మ కష్టాలు తలుచుకుంటే కన్నీళ్లాగవనీ తెలిపారు.ఇక ఆర్థిక కష్టాలు వెంటాడటంతో ఎన్నో కూలి పనులకు కూడా వెళ్లానని అదే సమయంలో తాను తాగుడకు బానిసయ్యానని తెలిపారు.

ఇలా తాగుడికి బానిస కావడంతో తాగి పక్కన పడేసిన ఎంగిలి బీడీలను ఏరుకొని తాగే వాడినని ఈయన తెలియజేశారు.ఇక అదే సమయంలో ప్రతి జిల్లాకు పోలీస్ శాఖ కళాబృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసింది.ఇక వారు నన్ను ఆ కళా బృందానికి హోం గార్డ్ (Home Guard)గా నియమించారు.

దాదాపు 22 సంవత్సరాలు పాటు హోంగార్డుగా విధులు నిర్వహించే రిటైర్డ్ అయ్యానని ఈయన తెలియజేశారు.చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడంతో ఎన్నో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలలో నటించాను.

అయితే తనకు జబర్దస్త్ వేణు(Venu) పరిచయం కావడంతో తన టీం లో జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశానని అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ద్వారా తనకు మరింత పేరు వచ్చిందని తనకు ఈ అవకాశం కల్పించిన వేణు ఋణం తీర్చుకోలేనని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube