ఇప్పటికీ మధ్య తరగతి అమ్మాయి గానే జీవిస్తున్నాను... కృతి సనన్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో నటి కృతి సనన్ (Kriti Sanan) ఒకరు.తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం నాగచైతన్య సరసన నటించారు.

 Still Living Like A Middle Class Girl Kriti Sanons Comments Go Viral, Prabhas, A-TeluguStop.com

తెలుగులో ఈమె నటించిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నారు.

Telugu Adipurush, Kriti Sanan, Mahesh Babu, Prabhas-Movie

ప్రస్తుతం బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం తాను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ తాను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని ఆ మధ్య తరగతి కుటుంబం విలువలను , మూలాలను తాను ఎప్పటికీ మర్చిపోనని ఈ సందర్భంగా వెల్లడించారు.ప్రేమాభిమానాలు పంచే కుటుంబం నిస్వార్థమైన స్నేహం తోడుగా ఉంటే ఎన్ని విజయాలు సాధించిన వ్యక్తిత్వంలో మార్పు రాదని వెల్లడించారు.

Telugu Adipurush, Kriti Sanan, Mahesh Babu, Prabhas-Movie

తాను ఢిల్లీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్న ఇప్పటికీ ప్రతిరోజు తన ఢిల్లీ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు.నా జయాపజయాలతో సంబంధం లేకుండా వారు నన్ను ఎంతగానో ఇష్టపడుతుంటారు.వారిది కల్మషం లేని ప్రేమ.

అలాంటి గొప్ప స్నేహబృందం, సంప్రదాయ విలువల్ని పాటించే కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా నా స్వభావంలో ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా కృతి సనన్ వెల్లడించారు.ఇలా మధ్యతరగతి కుటుంబం విలువల గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా (Adipurush Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube