తాజాగా యూట్యూబ్ తన ప్రీమియం సబ్ స్క్రైబర్ ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.యూట్యూబ్ క్యూలో వీడియోలను చేర్చడం, Meet లైవ్ షేరింగ్, Meet లైవ్ షేరింగ్ ప్లే, 1080p HD వీడియో సపోర్ట్, స్మార్ట్ డౌన్ లోడ్ అనే ఫీచర్లను iOS మరియు ఆండ్రాయిడ్ యాప్ లలో ప్రీమియం సబ్ స్కైబర్లులు ఉపయోగించుకోవచ్చు.
యూట్యూబ్ క్యూ ఫీచర్: ఈ ఫీచర్ యూట్యూబ్ వెబ్ లో ( YouTube )ఉండే ఫీచర్ లాగే ఉంటుంది.ఈ ఫీచర్ తో తదుపరి ప్లే చేయాలనుకుంటున్న వీడియోల యొక్క తాత్కాలిక జాబితాను ముందే సృష్టించుకోవచ్చు, వీడియోలను తిరిగి అమర్చుకోవడం లేదంటే తీసేయడం చేయవచ్చు.
Meet లైవ్ షేరింగ్: ఆండ్రాయిడ్ లోని యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రైబర్లు( YouTube Premium Subscribers ), గూగుల్ మీట్ ద్వారా స్నేహితులతో యూట్యూబ్ వీడియోలు చూడాలనుకుంటే, గూగుల్ మీట్ లైవ్ షేరింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు.ఈ ఫీచర్ యాక్సెస్ చేయాలంటే హోస్ట్ మాత్రమే ప్రీమియం సబ్స్క్రైబ్ అయి ఉంటే సరిపోతుంది.త్వరలో iOS వినియోగదారులు కూడా ఫేస్ టైం తో షేర్ ప్లే ని ఉపయోగించగలరు.
కంటిన్యూ వాచింగ్ ఫీచర్: ఒక వీడియోను సగం చూసి వదిలేసిన తర్వాత మళ్లీ అక్కడి నుండి కంటిన్యూ గా వీడియో చూడడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వెబ్లలో అందుబాటులో ఉంది.వేరువేరు పరికరాలలో లాగిన్ అయినా కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
iOS లోని ప్రీమియం వినియోగదారులు స్పష్టమైన వీడియోల కోసం ప్రత్యేకంగా 1080p వీడియో నాణ్యతకు సంబంధించిన అప్డేట్ ను పొందవచ్చు.1080p స్ట్రీమింగ్ ను HD నాణ్యతతో యాక్సెస్ చేసుకోవచ్చు.పైన చెప్పిన ఫీచర్లు పొందాలంటే ప్రీమియం వినియోగదారులు నెలకు రూ.129 లతో సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి.లేదంటే రూ.1290 లతో ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి.ఒకవేళ విద్యార్థులు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటే నెలకు రూ.79 చెల్లిస్తే సరిపోతుంది.