తెలుగు సిని ప్రేక్షకులకు కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి ( Rishabh Shetty )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాంతార సినిమాతో( Kantara movie ) దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి.
చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా సినిమా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఒక సినిమాతో స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి.ప్రస్తుతం రిషబ్ శెట్టి పార్ట్ కాంతార 2 ( Kantara 2 )లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి వార్తలు చక్కర్లు కొట్టడంతో ఈ విషయంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు.ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.నేను రాజకీయాలలోకి రావడం లేదు.ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
నా సినిమాలకు మద్దతునివ్వండి చాలు అంటూ అభిమానులకు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు రిషబ్ శెట్టి.
గతంలోనూ తన పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వినిపించాయని అయితే ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది అని తెలిపారు రిషబ్ శెట్టి.ఇకపోతే కాంతార 2 సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.