ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో( Srisailam ) ఏప్రిల్ నెల 11వ తేదీన శ్రీ భ్రమరాంబికా దేవి( Sri Bhramarambika Devi ) అమ్మ వారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది.ఈ కుంభోత్సవ ఏర్పాట్ల పై స్థానిక రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ అధికారులతో దేవాలయ ఈవో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ నెల 11వ తేదీన జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామని వెల్లడించారు.అంతే కాకుండా ఈ పుణ్యక్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతువు, పక్షు, బలలు జరగకుండా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు, సిబ్బందికి దేవస్థానం ముఖ్య అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా చెప్పాలంటే జంతుబలి నిషేధానికి పోలీస్, రెవెన్యూ సిబ్బంది కూడా అతని తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు.అంతే కాకుండా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే ముందు రోజు రాత్రి నుంచే దేవాలయ వీధిలో అంకాలమ్మ, పంచ మఠాలు, మహిషాసురమర్ధిని దేవాలయం వద్ద సిబ్బందికి గస్తీకి ప్రత్యేక విధులు కేటాయిస్తామని దేవాలయాల ఈవో లవాన్న వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పాలంటే జంతు బలులు జరగకుండా దేవస్థానం టోల్గేట్ దగ్గర తనిఖీలు విస్తృతంగా చేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.జంతు బలి నిషేధాన్ని భక్తులలో అవగాహన కోసం దేవాలయ బ్రాండ్ కాస్టింగ్ సిస్టం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని దేవాలయ ముఖ్య అధికారులు ఆదేశించారు.కుంభోత్సవం రోజు సున్నిపెంటలో మద్యం దుకాణాలు నిలిపివేసేలా జిల్లా కలెక్టర్ ని కోరుతామని ఈవో వెల్లడించారు.
కుంభోత్సవానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఈ కుంభోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అందుకు తగినట్లు ఏర్పాట్లు అన్ని కట్టు దిట్టంగా చేసామని ఈవో తెలిపారు.