తప్పు తప్పు ఇదంతా అబద్ధం.వట్టి మాటలు కట్టిపెట్టండి అని అంటారా! లేదంటే జీడిపప్పు( cashew nut ) ఎక్కడైనా అంత చవకగా దొరుకుతుందా? అనే అనుమానం మీలో చాలామందికి కలుగుతోంది కదూ.కానీ ఇక్కడ మీరు చదివింది అక్షరాలా నిజం.విషయం తెలియాలంటే ఈ పూర్తి స్టోరీని చదవాల్సిందే.
సాధారణంగా జీడిపప్పు అనేది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన గుండె, నరాల బలహీనత, కండరాల పనితీరు చక్కగా మెరుగవుతుంది.
అయితే జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ.సామాన్యులు కొనలేని రిచ్ ఫుడ్స్ ( Rich foods )లిస్టులోకి ఎప్పుడో వెళ్లిపోయాయి.
ఇక్కడ కేజీ జీడిపప్పు కొనాలంటే, క్వాలిటీని బట్టి రూ.వెయ్యి వరకు ఉంటుంది.అయితే మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం రూ.30కే జీడిపప్పు దొరుకుతుందని మీకు తెలుసా.నమ్మలేకపోయినా ఇది అక్షర సత్యం.జార్ఖండ్, జంతార జిల్లాలోని నాలా అనే గ్రామంలో జీడిపప్పును అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తారు.అందుకే దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు’ నగరంగా అభివర్ణిస్తారు.ఈ గ్రామానికి వెళ్తే కిలో జీడిపప్పు కేవలం రూ.20 నుంచి 30లకే లభిస్తుంది.మామూలుగా చెప్పాలంటే కూరగాయల కంటే ఛీపే అని అనుకోవాలి.
అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు నాలా గ్రామంలోనే జీడిపప్పును కొనుక్కొని మరీ తమ ఊళ్లకు వెళుతూ వుంటారు.ఇక్కడ నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారని మీకు తెలుసా? నాలా గ్రామంలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు.2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది.ఆ దిశగా గ్రామస్తులను ప్రోత్సహించింది.
దాంతో అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు.అక్కడ జీడిపప్పు విరివిగా పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు.