అక్కడికి వెళ్లినవారు బతికిబట్టకట్టలేదు... మానవ అవశేషాలతో నిర్మితమైన ప్రాంతం అది?

ఈ సువిశాల ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి.దూరపు కొండలు నునుపు అన్నట్టు… మనకు తెలియని ప్రపంచం చాలా అందమైనది అని భావిస్తూ ఉంటాం.

 Unbelievable Facts Behind Mysterious Venetian Gulf Island In Italy Details, Late-TeluguStop.com

కానీ దగ్గరకి వెళ్లి చూసాకే అందులో లోటుపాట్లేమిటో బోధపడతాయి.ఈ క్రమంలో మనం అనేక ప్రాంతాలు చాలా అందమైనవి అని వింటూ ఉంటాం.

అలాగే మరికొన్ని ప్రదేశాలు చాలా స్పెషల్ అని అంటుంటారు.కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగాను, మరికొన్ని ప్రదేశాల చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది.

ప్రస్తుతం అలాంటి ఓ భయానక ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం.ఈ ప్రాంతం సగం భూమి సగం మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతూ వుంటారు.అయితే ఈ నిర్మాణం వెనుక భయంకరమైన చరిత్ర కూడా ఉందని చెబుతారు.ఇంతకీ ఆ ప్రదేశం ఏదని అనుకుంటున్నారు కదూ? ఇటలీలోని( Italy ) వెనిస్, లిడో నగరాల మధ్య వున్న నిషేధ ప్రాంతమే ‘వెనీషియన్ గల్ఫ్.’( Venetian Gulf ) ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు.మరెక్కడికి పోతారంటారా? పైకే మరి.ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లి బతికి వచ్చిన మనిషి ఒక్కరు కూడా లేరని చెబుతూ వుంటారు.దీంతో ఆ నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది.

ఆ ప్రాంతాన్ని చాలామంది శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు.సుమారు 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్విపం చుట్టూతా ఎత్తైన గోడలు ఉంటాయి.ఈ ద్వీపం ఎందుకు మారిందంటే… ఇటలీలో ప్లేగు మహమ్మారి( Plague ) వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని అప్పటి ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకొని వెళ్లి వదిలేసిందట.ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని భావించిన ప్రభుత్వం అలాంటి దారుణానికి ఒడిగట్టింది.దాంతో ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా.మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా ద్వీపంలోనే వారిని ఖననం చేశారు.అందుకే ఈ ద్వీపంలోని సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube