నీలం రంగులో నిగనిగలాడుతూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించే నేరేడు పండ్లను ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో ఒకటిగా చెప్పుకుంటారు.ప్రస్తుత వేసవి కాలంలో విరి విరిగా లభించే నేరేడు పండ్లలో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఫైబర్ ఇలా ఎన్నో అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా నేరేడు పండ్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.కానీ, నేరేడు పండ్లను తినేందుకు కొందరు ఇష్టపడరు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా నేరేడు పండ్లను తీసుకుంటే మస్తు హెల్త్ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా ఒక కప్పు నేరేడు పండ్లను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన పండ్లను గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న నేరేడు పండ్ల ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, చిటికెడు బ్లాక్ సాల్ట్, నాలుగు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే.సూపర్ టేస్టీ అండ్ హెల్తీ నేరేడు పండ్ల జ్యూస్ సిద్ధం అవుతుంది.
వారంలో కనీసం రెండు సార్లు అయినా ఈ జ్యూస్‌ను తీసుకుంటే మీ కంటి చూపుకు ఇక తిరుగుండదు.

అవును, నేరేడు పండ్లలో ఉండే ప్రత్యేక పోషకాలు కంటి సంబంధిత సమస్యలను నివారించి చూపును మెరుగుపరుస్తాయి.అలాగే ఈ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఇమ్యూనటీ బూస్ట్ అవుతుంది.
కాలేయం శుభ్రం గా మారుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మరియు చర్మం ఎల్లప్పుడూ నిగారింపుగా కూడా ఉంటుంది.