టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గీతాకృష్ణ గురించి ఈ తరం వారికి తెలియకపోయినప్పటికీ, నిన్నటి తరం వారికి ఈయన గురించి సుపరిచితమే.ఈయన ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి అనంతరం దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో సుమారు అరడజనుకు పైగా సినిమాలు తెరకెక్కాయి.అయితే ఈ సినిమాలో ఈయనకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.
గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైన గీతాకృష్ణ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పలువురు హీరోలు గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు.
అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై వెండితెర పై ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.నిజం చెప్పాలంటే అనసూయ ఒక గొప్ప ఆర్టిస్ట్ అని ఈయన తన పై ప్రశంసలు కురిపించారు. రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని తెలిపారు.

ఇక తాజాగా పుష్ప సినిమాలో అసలు అనసూయని గుర్తుపట్టలేక పోయానని గీతాకృష్ణ తెలిపారు.అనసూయ ఎంతో అద్భుతంగా నటిస్తుందని ఆమె నటనను చూసి కొందరు అసూయ పడుతూ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారని, ఆమె పట్ల అసూయతోనే కొందరు నెటిజన్లు తనపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు.అనసూయ ముఖ్యంగా తన వస్త్రధారణ విషయంలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.అయితే గీతాకృష్ణ మాత్రం అనసూయ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుందని, తన డ్రస్సింగ్ స్టైల్ తనకు నచ్చుతుందని ఈ సందర్భంగా అనసూయ గురించి కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







