పాపం హీరోయిన్లు ఎంత యంగ్ గా ఉన్నా కూడా వారికి మాత్రం ట్రోల్స్ తప్పవు.ముఖ్యంగా పెళ్ళై పిల్లలు ఉన్న హీరోయిన్లను మాత్రం జనాలు అసలు వదలడం లేరు.
వాళ్ళు ఎంత యంగ్ గా ఉన్న వారిని ఆంటీ అంటూ బాగా ఆడుకుంటున్నారు.ఇప్పటికి స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా వారికి మాత్రం జనాల నుండి ఇటువంటివి తప్పటం లేదు.
ఇక ఇంతకాలం కుర్రాళ్ల మదిలో క్రష్ గా ఉన్న బ్యూటీ ఇప్పుడు అదే కుర్రాళ్లతో ఆంటీ అని పిలిపించుకునే పరిస్థితికి వచ్చింది.ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు కాజల్ అగర్వాల్.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందాలతో అందర్నీ తన వైపుకు మలుపుకున్న ఈ బ్యూటీ.
తన నటన పరంగా కూడా అందర్నీ ఆకట్టుకుంది.ఇక అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.
లక్ష్మి కళ్యాణం సినిమాతో తొలిసారిగా కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది.ఆ తరువాత మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్గా నటించినది.ఇక ఈ సినిమాతో తను మంచి సక్సెస్ అందుకుంది.
నిజానికి కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే.తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ స్టార్ హోదాకు చేరుకుంది.మంచి హోదాలో ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూను ప్రేమ పెళ్లి చేసుకుంది.
అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
కొడుకు పుట్టాక కాజల్ ను చూసి తెలుగు ప్రేక్షకులు చాలా మురిసిపోయారు.
ఇక మళ్లీ మునుపటిలా కనిపించడానికి బాగా వర్క్ అవుట్ లు కూడా చేస్తుంది.
ఇక తన వర్కౌట్లు చేసే వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తన బాబు ఫోటోలు కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.
ఆ మధ్యనే మళ్లీ ఇండస్ట్రీకి రిఎంట్రీ కూడా ఇచ్చింది.ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో బిజీగా ఉంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా.ఆమె మంచి అవుట్ ఫిట్ ధరించి ఫోటోలకు అందమైన ఫోజులు ఇచ్చింది.ఇక ఆ ఫోటోలు చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొట్టగా మరి కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఓ నెటిజన్ మాత్రం.వావ్ ఆంటీ. అవుట్ ఫిట్ బాగుంది అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
దీంతో కాజల్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.బాబు పుట్టినంత మాత్రాన ఆంటీ చేసేస్తారా అంటూ బాగా ఫీలవుతున్నారు.