సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు కొన్ని సినిమాలు మాత్రమే చేస్తారు మిగితా సినిమాలు చేసిన అవి వాళ్ళకి సెట్ అవ్వవు.అందుకే వాళ్ళు పెద్దగా అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడరు మెగాస్టార్ చిరంజీవి అంటే అప్పట్లో ఒక మాస్ ఇమేజ్ ఉండేది అలాంటి టైం లో ఆయనతో రుద్రవీణ అనే సినిమా తీశారు ఈ సినిమా స్టోరీ బాగుంటుంది అయినా కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు ఎందుకంటే ఈ సినిమా మొత్తం చిరంజీవి చాలా క్లాస్ గా కనిపిస్తాడు దాంతో అప్పటి దాక చిరంజీవిని మాస్ గా చూసిన జనాలు అంత క్లాస్ గా చూడలేకపోయారు చిరంజీవి అంటేనే ఫైట్స్ తో సినిమా ఉండాలి ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు దాంతో ఈ సినిమా అంటేనే చాలామంది కి పెద్దగా నచ్చలేదు.
ఇక ఈ సినిమా తర్వాత కె విశ్వనాధ్ డైరెక్షన్ లో ఆపద్భాందవుడు అనే సినిమా చేసాడు ఈ సినిమా కూడా బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయింది.అయినా కూడా ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ చాలా బాగుంటుంది.కె విశ్వనాధ్ గారి డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఇక ఈ సినిమాలన్నీ ప్లాప్ అవ్వడం తో చిరంజీవి సాఫ్ట్ సినిమాలు చేయకుండా మళ్లీ మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు ఇప్పటికి చిరంజీవి మాస్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక ప్రస్తుతానికి భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా కమర్షియల్ సినిమానే కావడం విశేషం అనే చెప్పాలి.ఈ సినిమా కి మెహర్ రమేష్ డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకి రీమేక్… ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమా తో సక్సెస్ కొట్టిన చిరంజీవి భోళా శంకర్ సినిమా తో కూడా సక్సెస్ కొట్టి సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు…