ఈ మూడు డైట్ లో ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ దెబ్బకు కరుగుతుంది!

కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే.

 These Are The Best 3 Foods That Reduce Bad Cholesterol Details! Bad Cholesterol,-TeluguStop.com

మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, మధ్యపానం త‌దిత‌ర కారణాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంటుంది.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యానికి ముప్పు రెట్టింపు అవుతుంది.అందుకే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ఎప్పటికప్పుడు కరిగించుకుంటూ ఉండాలి.

అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మూడు ఆహారాలు డైట్ లో ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ దెబ్బకు కలుగుతుంది.

మరి ఇంతకీ ఆ మూడు ఆహారాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మిరియాలు.

వీటిని కింగ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తుంటారు.ఘాటైన రుచి వాసన కలిగి ఉండే మిరియాలు వంటలకు చక్కటి రుచిని అందిస్తాయి.

అలాగే మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.నాలుగు ఐదు మిరియాలు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే బాడ్ కొలెస్ట్రాల్ చక్కగా కరుగుతుంది.

వెయిట్ లాస్‌కు కూడా మిరియాలు ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

అలాగే దాల్చిన చెక్క కూడా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడుతుంది.అర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ వాటర్ లో ఐదు నిమిషాల పాటు మరిగించి.ఆ వాటర్ ను తీసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ వాటర్ ను తీసుకుంటే బాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

ఇక కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఉపయోగపడే ఆహారాల్లో పసుపు ఒకటి.పసుపును ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.దీంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది.రోగ‌ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.లివర్ ను శుభ్రంగా మారుస్తుంది.

ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube