టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సార్’.ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
వీరిద్దరి జోడీ ఫ్యాన్స్ ను బాగా అలరించింది అనే చెప్పాలి.ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.
ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.సినిమా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.వెంకీ అట్లూరి ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాడు.దీంతో ఈ సినిమాతో తమిళ్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గర అయ్యాడు.
ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కడంతో పాజిటివ్ టాక్ వచ్చింది.ధనుష్ కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఇక తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అనే చెప్పాలి.
ఇప్పటికే రిలీజ్ అయిన చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా యూఎస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి వీకెండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సోమవారం నుండి కూడా మంచి హోల్డ్ తో తన హవా కొనసాగిస్తుంది.ఇదే హవా యూఎస్ లో కూడా అందుకుంటుంది.ఇక యూఎస్ లో రెండవ వారానికి మరిన్ని స్క్రీన్స్ ను యాడ్ చేసుకుంటుందట.
దీంతో సార్ సినిమా యూఎస్ లో మరిన్ని వసూళ్లు అందుకోనుంది.ఇక తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందించాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.