మాస్ మహా రాజ రవితేజ తో డాన్ శీను అనే సినిమా తీసి హిట్టు కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని మనందరికీ తెలిసిన వ్యక్తే… ఈయన తీసిన సినియాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈయన చేసిన 7 సినిమాల్లో 3 సినిమాలు రవితేజ తోనే చేశారు ఈ 3 సినిమాలు కూడా చాలా పెద్ద సక్సెస్ అందుకున్నాయి.
ముఖ్యం గా బలుపు, క్రాక్ సినిమాలు గోపిచంద్ మలినేని కి గానీ, రవితేజ కెరియర్ కి గానీ చాలా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి.అయితే గోపిచంద్ మలినేని ఒక సీరియస్ స్టోరీ ని ఎన్టీయార్ కి చెబితే అది మొత్తం విన్న ఎన్టీయార్ స్టోరీ బాగుంది కానీ నీ మార్క్ కామెడీ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి గోపి అని అన్నాడట…అలా ఎన్టీయార్ తో కూడా ఒక సినిమా చేయాల్సింది కానీ మిస్ అయిపోయాడు ఇక రీసెంట్ గా బాలయ్య తో సంక్రాంతి హిట్ కొట్టిన గోపిచంద్ తర్వాత సినిమా కోసం స్టోరీ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కూడా మైత్రి వాళ్ల బ్యానర్ లోనే ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటికే వాళ్ళు స్పష్టం చేశారు.ఇక ఈ సినిమా కూడా మరో స్టార్ హీరో తోనే ఉండబోతుందనే విషయం అయితే తెలుస్తుంది…ఇంకా వాళ్ళు ఎవరు అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ఒక్క సినిమా చేశాక మళ్ళీ బాలయ్య తో సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే బాలయ్య కి ఒక్కసారి హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ తో మళ్ళీ సినిమాలు చేస్తాడు.ఇక ఇది ఇలా ఉంటే వీర సింహ రెడ్డి సినిమా చాలా బాగుందని డైరెక్షన్ అద్భుతంగా చేశారని ఇప్పటికే రజినీకాంత్ లాంటి గ్రేట్ హీరో గోపిచంద్ మలినేని కి కాల్ చేసి మాట్లాడారు అంటే గోపిచంద్ మలినేని గారు ఎంత పెద్ద స్థాయి కి ఎదిగారో మనం చెప్పవచ్చు…
.