విజయవాడతో లింకులు ఉన్న డ్రగ్ రాకెట్ కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.2021 సెప్టెంబర్ లో గుజరాత్ ముంద్రా పోర్టులో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిన సంగతి తెలిసిందే.
డ్రగ్ ముఠాకు విజయవాడతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అదేవిధంగా ఆఫ్ఘాన్ కు చెందని హసిఫ్ హసన్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు.
భారత్ లో హసిఫ్ హసన్ ప్రతినిధులుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమిత్, సుధాకర్ లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.అంతేకాకుండా భార్య వైశాలి పేరుతో విజయవాడలో సుధాకర్ ఫేక్ ట్రేడింగ్ కంపెనీ ఉంది.
విజయవాడ చిరునామాతో ఎగుమతి, దిగుమతుల కోడ్ లైసెన్స్ తీసుకుని హెరాయిన్ ట్రాన్స్ పోర్ట్ చేసినట్టు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే మాచవరం సుధాకర్ ఏ21గా, ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఏ8గా ఎన్ఏఐ పేర్కొంది.
అంతేకాకుండా హెరాయిన్ దిగుమతి వెనుక లష్కరే తోయిబా ఉన్నట్లు తేల్చింది.మాదకద్రవ్యాలు అమ్మి ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చినట్లు నిర్ధారించారు.
ఎన్ఏఐ అభియోగ పత్రంలో లష్కరే తోయిబా పాత్ర వెలుగు చూసిందని సమాచారం.