లక్ష్మీ కళ్యాణం సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత పలు సినిమాలతో హీరోయిన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా చందమామ మగధీర సినిమాలు కాజల్ అగర్వాల్ కెరియర్ లో చిర స్థాయిగా నిలిచి పోతాయి.
అలాంటి సినిమా లో నటించిన తర్వాత కాజల్ అగర్వాల్ వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడి గా నటించే అవకాశాలను సొంతం చేస్తుంది.కెరీర్ ఆరంభం నుండే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు నో చెబుతూ వస్తున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలం లో పెళ్లి అయ్యి తల్లి కూడా అయింది.
కనుక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా లకు ఓకే చెబుతుందేమో అని కొందరు భావించారు.నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా తో రీఎంట్రీ ఇచ్చేందుకు కాజల్ అగర్వాల్ సిద్ధమయ్యింది.ఈ సమయం లో ఆమె కు ఒక యువ దర్శకుడు లేడి ఓరియంటెడ్ కథ ను చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించాడట.
కానీ కాజల్ అగర్వాల్ కనీసం ఆ కథ ను వినేందుకు కూడా ఆసక్తి చూపించలేదని సమాచారం అందుతుంది.కేవలం కమర్షియల్ సినిమా లో నటించాలని హీరో లకు జోడిగా హీరోయిన్ గా నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తుందట.కెరియర్ లో మరికొన్నాళ్ల పాటు కమర్షియల్ హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకొని ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు< కొన్నాళ్లు చేసి ఇండస్ట్రీకి దూరమవ్వాలని కాజల్ అగర్వాల్ భావిస్తుందేమో అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ తో ప్రస్తుతం చేయబోతున్న సినిమా కు సంబంధించిన అప్డేట్ అధికారికంగా రావాల్సిందే.ఆ సినిమా హిట్ అయితే కచ్చితంగా ముందు ముందు భారీగా అవకాశాలు ముద్దుగుమ్మ తలుపు తట్టే అవకాశం ఉంది.