వారంలో ఒక్కసారి ఇలా చేస్తే కుదుళ్లు బలంగా మారడమే కాదు చుండ్రు సైతం పోతుంది!

పోషకాల కొరత, మద్యపానం, ధూమపానం, కాలుష్యం పలు రకాల మందుల వాడకం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారుతుంటాయి.దీని కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.

 If You Follow This Remedy Once A Week, Hair Follicles Will Become Strong! Hair F-TeluguStop.com

హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టాలంటే మొదట కూతుళ్లను బలంగా మార్చుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

వారంలో ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే కుదుళ్లు బలంగా మారడమే కాదు చుండ్రు సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి అనేది ఓ చూపు చూసేయండి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Follicles, Remedy, Latest-Tel

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, కలోంజి సీడ్స్‌ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె మరియు వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Follicles, Remedy, Latest-Tel

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు మాత్రం బాగా పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో ఒకే ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎంతటి బలహీనమైన కుదుళ్లు అయిన కొద్ది రోజుల్లోనే బలంగా,ఆరోగ్యంగా మారతాయి.

దాంతో హెయిర్ ఫాల్ అనేది క్రమంగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే మెంతులు ఆముదం చుండ్రు సమస్యను వదిలించడానికి సూపర్ ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.అందువల్ల ఈ రెమెడీని పాటిస్తే కుదుళ్లు బలంగా మారడమే కాదు చుండ్రు సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube