సాధారణంగా ఒక్కోసారి ముఖ చర్మం చాలా డల్ గా మారిపోతూ ఉంటుంది.డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఎండల ప్రభావం, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల స్కిన్ డల్ అవుతూ ఉంటుంది.
అలాంటి సమయంలో చర్మాన్ని మళ్లీ ప్రకాశవంతంగా మెరిపించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే కేవలం ఇరవై నిమిషాల్లో ఇన్స్టెంట్ గ్లో( Instant glow ) మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్( Orange peel powder ) వేసుకోవాలి.అలాగే చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.డల్ నెస్ ను దూరం చేస్తుంది.చర్మాన్ని సూపర్ గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.పైగా ఈ రెమెడీని రెండు రోజులకు ఒకసారి పాటిస్తే చర్మంపై మొండి మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.
పిగ్మెంటేషన్ సమస్యకు బై బై చెప్పవచ్చు.మరియు ఈ రెమెడీ వల్ల మీ స్కిన్ టోన్ ఈవెన్ గా సైతం మారుతుంది.