అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది.మిస్సిసిపీలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఒక్క వ్యక్తే కాల్పులు జరిపినట్లు భావిస్తున్న పోలీసులు అందుకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.