తారకరత్న ఆరోగ్యం గురించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాట్లాడకపోవడానికి కారణమిదేనా?

నందమూరి తారకరత్న ఆరోగ్యం విషయంలో గత కొన్నిరోజులుగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు.ఆయన కుటుంబ సభ్యులు సైతం తారకరత్న పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.

 Ntr Kalyan Ram Silence About Tarakaratna Health Details Here Goes Viral In Socia-TeluguStop.com

అయితే తాజాగా అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో తారకరత్న ఆరోగ్యం గురించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాట్లాడతారని అందరూ భావించారు.అయితే వాళ్లిద్దరూ ఇందుకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేయలేదు.

అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం తారకరత్న హెల్త్ గురించి ఈ ఇద్దరు హీరోలు మాట్లాడితే అమిగోస్ మూవీ కంటే తారకరత్న హెల్త్ గురించి ఎక్కువగా చర్చ జరిగి సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.మరోవైపు తారకరత్న ఆరోగ్యం విషయంలో పెద్దగా మార్పు లేదని అందుకే ఈ హీరోలు ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం అందుతోంది.

Telugu Amigos Pre, Kalyan Ram, Tarakaratna-Movie

తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేసినా ఆ కామెంట్ వల్ల వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఈ రీజన్ వల్లే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.తారకరత్న త్వరగా కోలుకుని సాధారణ మనిషి అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆ మంచి రోజు రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Telugu Amigos Pre, Kalyan Ram, Tarakaratna-Movie

మరోవైపు అమిగోస్ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.బింబిసార స్థాయిలో ట్రైలర్ తో అమిగోస్ మూవీ మెప్పించలేదు.సినిమాకు టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రమే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.9 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు అమ్ముడయ్యాయి.కనీసం 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube