ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.
సీఎం జగన్ కు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే కానీ ప్రజల గురించి అవసరం లేదని చంద్రబాబు విమర్శించారు.సొంత లాబీయింగ్ కోసమే వైసీపీ ఎంపీలు పని చేస్తున్నారని చెప్పారు.
కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుతో సాగునీటి పరంగా రాయలసీమకు తీవ్రనష్టమని పేర్కొన్నారు.అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి జగన్ తప్పించుకోలేరని వెల్లడించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ల ట్యాపింగ్ పై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.