వామ్మో.. సమంత చేస్తున్న నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన బుడ్డది.. వైరల్ వీడియో?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సమంత గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.ఎందుకంటే ఈమె తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది కాబట్టి.

 Small Girl Cute Video On Samantha Movies Viral On Social Media Details, Viral Vi-TeluguStop.com

నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా సమంత బాగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ఇక అప్పటినుంచి వెనుకకు తిరిగి చూడకుండా ఇప్పటివరకు పరుగులు తీస్తూ వచ్చింది.

మధ్యలో ఎన్నో సక్సెస్ లు అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది.అతి తక్కువ సమయం లోనే మంచి అభిమానం సొంతం చేసుకుంది.చాలావరకు స్టార్ హీరోల సరసన నటించింది.కేవలం నటిగానే కాకుండా పలు వ్యాపారాలు కూడా ప్రారంభించింది.

వ్యాపారాల పరంగా కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా కలిసి వచ్చింది.ఒక మంచి హోదాలో ఉన్న సమయంలో తనతో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి సినిమాలలో చేశారు.మూడు సంవత్సరాల వరకు వీరిద్దరూ క్యూట్ కపుల్ గా నిలిచారు.ఏ పని చేసిన, ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టిలో పడేవాళ్లు.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్ల తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో నాలుగేళ్లకే పచ్చని కాపురాన్నిదూరం చేసుకున్నారు.

వీరి విడాకులను వీరి అభిమానులు అసలు తట్టుకోలేకపోయారు.

ఇక విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.

అంతేకాకుండా వచ్చిన సినిమాలకు నో అనుకుండా నటించేసింది.కేవలం టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషలలో కూడా సమంతకు బాగా అవకాశాలు వచ్చాయి.

పుష్ప సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది.ఇక గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ప్రస్తుతం ఆమె ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.త్వరలో శాకుంతలం సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక గత ఏడాది యశోద సినిమా సమయంలో సమంత మయాసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం బయటపడింది.ఈ విషయాన్ని స్వయంగా తానే తెలిపింది.ప్రస్తుతం ఆమె ఈ వ్యాధితో చికిత్స పొందుతుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే.

తాజాగా సమంత చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఒక బుడ్డది తన మాటల్లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ మాటలు విని సమంత కూడా ఫిదా అయింది.

అందులో ఆ బుడ్డది.సమంత యశోద సినిమా నుంచి మంచి దారిలో నడుస్తుందని.

  అంతకుముందు తన దారి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు పోయింది అని మరికొన్ని నిర్లక్ష్య పనులు ఆశ్చర్యపడే మాటలతో చెప్పింది ఆ బుడ్డది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.

ఆ వీడియో చూసిన సమంత అభిమానులు, నెటిజన్స్ ఆ బుడ్డ దాని మాటలకు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube